తెలంగాణ

telangana

ETV Bharat / international

Biden News: బూస్టర్ డోసు తీసుకున్న బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధంలో కొవిడ్ బూస్టర్ డోసు(Biden Booster) తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన(Biden News).. అర్హత ఉన్నవారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

biden
బైడెన్

By

Published : Sep 28, 2021, 5:13 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden News) శ్వేతసౌధంలో కొవిడ్​ బూస్టర్ డోసు(Biden Booster shot) తీసుకున్నారు. బైడెన్ ఫైజర్ టీకా మూడో డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

"కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే అందరూ కచ్చితంగా టీకా వేసుకోవాలి. అలా చేస్తేనే పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. పిల్లలు, పెద్దలు సురక్షితంగా ఉంటారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. టీకా తీసుకుంటే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడినవారు అవుతారు" అని బూస్టర్ డోసు తీసుకున్న అనంతరం బైడెన్ అన్నారు. మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్ రాలేదని బైడెన్ పేర్కొన్నారు.

అర్హత ఉన్న వారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని బైడెన్(Biden News Today) తెలిపారు. ముందుగా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తు చేశారు. అమెరికాలో ఇప్పటివరకు కనీసం ఒక్కడోసు తీసుకున్న వారు 77 శాతంగా ఉన్నారని తెలిపిన బైడెన్.. 23 శాతం మంది అసలు టీకా తీసుకోలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికాలో 65 ఏళ్లు పైబడినవారికి ఫైజర్ బూస్టర్ డోసు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:ఘోరంగా పడిపోయిన బైడెన్​ గ్రాఫ్​.. కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details