అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అమెరికాలో ఉండేందుకు వీలుగా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తేవాలని పేర్కొన్నారు. దీనిలో పారదర్శకత తెచ్చేందుకు రిపబ్లికన్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్వేతసౌధం గురువారం వెల్లడించింది.
'అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించాలి' - america immigration white house
ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వలసదారులపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని బైడెన్ ఇటీవలే ఎత్తివేశారు.
'ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరించాలి'
కరోనా వ్యాప్తి సమయంలో వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బైడెన్ ఇటీవలే ఉపసంహరించుకున్నారు. ఇది వీసా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే కాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందన్నారు.
ఇదీ చదవండి :భారత్- పాక్ ప్రకటనపై అమెరికా ఏమందంటే?