అణ్వాయుధాల పరీక్షల నిలిపివేతపై ఉత్తర కొరియాతో మరోమారు చర్చలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ మేరకు వెల్లడించారు ఉత్తరకొరియాకు అమెరికా ప్రతినిధి స్టీఫెన్ బైగున్.
దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు మంగళవారం ముగిశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాతో చర్చలు ప్రారంభమవుతాయనే అంచనాలు పెరిగాయి. ఈ మేరకు సియోల్లో ఆ దేశ ప్రతినిధులతో సమావేశానంతరం ఉత్తరకొరియాతో భేటీపై స్పష్టత నిచ్చారు బైగున్. రష్యాకు దౌత్యవేత్తగా వెళుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.
" ఉత్తరకొరియాతో త్వరితగతిన చర్చలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొరియాతో చర్చల్లో పురోగతి సాధించేందుకు కృషి చేస్తా. దక్షిణ కొరియా అణు నిరాయుధీకరణ చేపట్టే దిశగా పనిచేసేలా శాయశక్తులా ప్రయత్నం చేస్తా."