తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్రరాజ్యంలో కొత్తగా 67 వేలకు పైగా కేసులు

కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 67 వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 36 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య లక్ష 40 వేలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి 36 లక్షల 91 వేల 627కి చేరింది.

US posts new daily #COVID19 case record of 67,632
అగ్రరాజ్యంలో కొత్తగా 67వేలకు పైగా కేసులు

By

Published : Jul 16, 2020, 9:26 AM IST

కరోనా మహమ్మారి కారణంగా కకావికలమైన అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా రికార్డు స్థాయిలో 67 వేల 632 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షల 16 వేల 747కి చేరింది. ఇప్పటివరకు లక్ష 40వేల 140 మందిని వైరస్ బలిగొంది. 16 లక్షల 45 వేల 962 మంది కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి 36 లక్షల 91 వేల 627కు చేరింది. వైరస్​ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5 లక్షల 86 వేల 821కు పెరిగింది. 80 లక్షల 37 వేల 170 మంది వైరస్​ బారినపడి కోలుకున్నారు.

కేసులు అధికంగా ఉన్న దేశాలు

దేశం కేసులు మరణాలు
1 అమెరికా 36,16,747 1,40,140
2 బ్రెజిల్​ 19,70,909 75,523
3 భారత్​ 9,36,181 24309
4 రష్యా 7,46,369 11,770
5 పెరు 3,37,724 12,417
6 చిలీ 3,21,205 7,186
7 మెక్సికో 3,17,635 36,906
8 దక్షిణాఫ్రికా 3,11,049 4,453
9 స్పెయిన్​ 3,04,574 28,413
10 బ్రిటన్​ 291,911 45,053

ఇదీ చూడండి: 'ముందుంది మంచి కాలం- మళ్లీ నా గెలుపు తథ్యం'

ABOUT THE AUTHOR

...view details