అమెరికాలో డెట్రాయిట్ హుక్కా బార్లో ఓ దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన గొడవలో ఆ వ్యక్తి.. ఏకంగా ఎనిమిది మందిని కత్తితో పొడిచాడు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది..

ఆదివారం తెల్లవారుజామున 4:40 గంటల ప్రాంతంలో.. టియాగ హుక్కా లాంజ్‌లో 34 ఏళ్ల వ్యక్తి పార్కింగ్ స్థలంలోకి వెళ్లే క్రమంలో గొడవ ప్రారంభమైందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అయితే.. ఈ ఘటనలో తొలుత అక్కడ కాల్పులు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత.. కత్తిపోట్లు చోటుచేసుకున్నట్లు వివరించారు.
ఈ ఘర్షణలో నిందితుడు కూడా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:నిబంధనల ఉల్లంఘనులపై తూటాల వర్షం- ఒకరు మృతి