US Omicron Cases: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. అగ్రరాజ్యం కూడా అందుకు మినహాయింపు కాదు. అమెరికాలో గత వారం నమోదైన కొవిడ్ కేసుల్లో 59 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉన్నారు. అంతకుముందు వారంలో ఇది 23 శాతంగా ఉండేది. ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-సీడీసీ మంగళవారం వెల్లడించింది.
అయితే ఇదివరకుతో పోలిస్తే ఈ అంచనాను తగ్గించినట్లు సీడీసీ పేర్కొంది. కానీ ఒమిక్రాన్ తీవ్రత కొనసాగుతోందని స్పష్టం చేసింది.
California records more than 5 million cases
- అమెరికా కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 50 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇన్ని కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 75 వేల 500 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.
- 2020 జనవరి 25న అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. నవంబర్ 11 నాటికి అంటే 292 రోజుల్లో మిలియన్ మార్కుకు చేరింది.
- గత వారంలో చూసుకుంటే.. ప్రతి లక్ష మందిలో సగటున 16 మందికి వైరస్ సోకింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
- చైనాలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన రోజుల్లో అమెరికాలోని కాలిఫోర్నియా కూడా ఎక్కువ ప్రభావితమైంది.
- 2020 మార్చిలోనే ఆంక్షలు విధించారు స్థానిక గవర్నర్. స్టే ఎట్ హోం ఆర్డర్ జారీ చేశారు. వ్యాపారాలు మూసివేశారు. అయినా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది.
టెక్సాస్‌లో 44 లక్షలు, ఫ్లోరిడాలో 39 లక్షల మంది కరోనా బారినపడ్డారు.