ఉగ్రసంస్థ ఐసిస్ అధినేత అబూ బకర్ అల్-బాగ్దాదీని వెంటాడి హతమార్చిన అమెరికా.. ఇప్పుడు ఆ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారిస్తోంది. ఇటీవలే కొత్త నాయకుడిని ప్రకటించిన ఆ సంస్థను హెచ్చరించింది అగ్రరాజ్యం. 'ఆ కొత్తనాయకుడెవరో మాకు తెలియదు.. కానీ, అతడినీ అంతమొందించి తీరుతామని' సంకేతాలు ఇచ్చింది.
అమెరికా సైనిక ఆపరేషన్‌లో బాగ్దాదీ కుక్కచావు చచ్చిన అనంతరం.. ఐసిస్‌కు కొత్త నాయకుడిగా అబూ ఇబ్రహీం అల్-హషీమీ అల్-ఖురేషీని ప్రకటించింది ఆ సంస్థ. అయితే అమెరికా మాత్రం ఆ ప్రకటనను తేలికగా పరిగణిస్తోంది. తమకు అతనెవరో తెలియదని, అసలు ఐసిస్ అనుచరులకూ ఖురేషీ ఎవరో తెలిసి ఉండదని ఎద్దేవా చేసింది.