అమెరికా యుద్ధనౌకలో ఓ నావికుడికి కరోనా సోకినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయ్యిందని ఆ దేశ నేవీ వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులపాటు దక్షిణ ఇటలీ నౌకాశ్రయంలో విధులు నిర్వహించిన సైనికుడే వైరస్ బారినపడినట్లు తెలిపారు అధికారులు.
అయితే, ఇది కేవలం ప్రాథమిక నిర్ధరణ మాత్రమేనని, అమెరికా వ్యాధి నియంత్రణ-నిరోధక కేంద్రం పరిశీలించిన తర్వాతే తుది ధ్రువీకరణ వెలువడుతుందని చెప్పారు నేవీ అధికారులు.
కరోనా సోకిన సైనికుడు యూఎస్ఎస్ బాక్సర్ యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ నౌక కాలిఫోర్నియాలోని శాన్ డీగోలో ఉన్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు.