అమెరికా నౌకాదళంలో చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా నియమితులైన తొలి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌ఎస్ కాన్‌స్టిట్యూషన్ అనే యుద్ధనౌకలోని ఒక భారీ తుపాకీకి ఆమె పేరును పెడుతున్నట్లు నేవీ పేర్కొంది. లొరెట్టా పర్ఫెక్టస్ వాల్ష్ పేరిట 'ఫర్ఫెక్టస్' అని ఆ ఆయుధానికి నామకరణం చేసింది. ఆమె.. 1917 మార్చి 21న నౌకాదళ చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 'మహిళా మాసాన్ని' పురస్కరించుకొని సోమవారం బోస్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పేరును ఖరారు చేశారు.
అమెరికా నౌకాదళ తొలి మహిళా అధికారికి గౌరవం - యూఎస్‌ఎస్ కాన్స్టిట్యూట్లో పర్ఫెక్టస్ తుపాకీ
అగ్రరాజ్య నేవీ విభాగంలో తొలి మహిళా అధికారికి అరుదైన గౌరవం లభించింది. 1917 మార్చి 21న చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా ఆమె నియామకం కాగా.. యూఎస్‌ఎస్ కాన్‌స్టిట్యూషన్ యుద్ధనౌకలోని ఓ భారీ ఆయుధానికి ఆమె పేరు పెట్టింది అమెరికా.
అమెరికా నౌకాదళ తొలి మహిళా అధికారికి గౌరవం
యూఎస్‌ఎస్ కాన్‌స్టిట్యూషన్.. ప్రపంచంలోనే అత్యంత పురాతన యుద్ధనౌక. 1797 నుంచి 1855 వరకూ అది సేవలు అందించింది. ఇప్పటికీ సముద్రయానం చేసే స్థితిలో ఉంది. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఈ నౌక.. ఓటమి ఎరుగదు.
ఇదీ చదవండి:బైడెన్ సర్కార్కు 'వలస' తలనొప్పులు