తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ సర్కార్​లో కరోనా చిచ్చు- మంత్రి రాజీనామా - coronavirus condition overview

అమెరికా అధికార యంత్రాంగంలో కరోనా వైరస్ చిచ్చుపెట్టింది. నౌకదళ మంత్రి థామస్ మోడ్లీ పదవి కోల్పోయేందుకు కారణమైంది. విమాన వాహక నౌక థియోడర్ రూజ్​వెల్ట్​లో కొందరికి కరోనా వైరస్​ సోకడంపై సరైన రీతిలో స్పందించలేదన్న ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేశారు థామస్ మోడ్లీ.

corona
అమెరికా నౌకాదళంలో కరోనా చిచ్చు.. మంత్రి రాజీనామా

By

Published : Apr 8, 2020, 10:22 AM IST

అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్ ఆ దేశ నౌకాదళంలో సంక్షోభానికీ వైరస్ కారణమైంది. అమెరికా విమాన వాహక నౌక థియోడర్ రూజ్​వెల్ట్​లో కరోనా కలకలానికి బాధ్యత వహిస్తూ నౌకాదళ మంత్రి థామస్ మోడ్లీ రాజీనామా చేశారు.

ఇదీ జరిగింది..

థియోడర్ రూజ్​వెల్ట్​ నౌకలోని పలువురు నౌకాదళ సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నౌకలో వైరస్​ను నియంత్రించలేని కారణంగా కెప్టెన్ బ్రెట్ క్రోజియర్​ను ఐదురోజుల కింద బాధ్యతల నుంచి తప్పించారు మోడ్లీ. అయితే ఎలాంటి విచారణ నిర్వహించకుండా క్రోజియర్​ను, సిబ్బందిపై వేటు వేయడం వివాదానికి కారణమైంది. దీంతో థామస్ మోడ్లీ రాజీనామా చేశారు.

రాజీనామా లేఖతో పాటు..

రాజీనామా లేఖతో పలు కీలక ఆరోపణలు చేశారు థామస్ . వైరస్ బాధిత నౌకలో పరిస్థితిని రక్షణ విభాగం పెంటగాన్ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

థియోడర్ సిబ్బంది యథాతథం..

నౌకా సిబ్బందిని బాధ్యతల నుంచి తప్పించిన వ్యవహారంలో క్షమాపణలు చెప్పారు మోడ్లీ. అయితే అగ్రరాజ్య ప్రభుత్వ పెద్దలు ఆయన వివరణను పట్టించుకోలేదు. రూజ్​వెల్ట్​ నౌకలోని సిబ్బంది యథాతథంగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రకటించారు రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్.

ఇదీ చూడండి:మహమ్మారుల జననమెట్టిది.. మానవాళి జయమెట్టిది

ABOUT THE AUTHOR

...view details