దిగ్గజ వాహనాల తయారీ సంస్థ ఫోర్డ్ తమ ఉద్యోగులను భారీగా తగ్గించుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 7,000 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే వేతనాల భారం 10 శాతం తగ్గుతుందని ఫోర్డ్ పేర్కొంది. ఈ నిధులను విద్యుత్, స్వయంచోదక (డ్రైవర్ అవసరం లేని) వాహనాల తయారీకి వినియోగించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
అమెరికాలో అధికం
అమెరికాలో మొత్తం 2,300 ఉద్యోగాలు తొలగించాలని ఫోర్డ్ నిర్ణయించింది. అందులో 1,500 మంది స్వచ్ఛందంగా తప్పుకోనున్నారని కంపెనీ తెలిపింది. 300 మంది ఉద్యోగులు ఇప్పటికే సంస్థను వీడగా.. 500 మంది ఈ వారంలో ఉద్యోగాన్ని వదిలేయనున్నట్లు పేర్కొంది.