అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గూఢచర్యం ఆరోపణలతో చైనా కాన్సులేట్‌ను మూసివేసిన అగ్రరాజ్యం.. వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించే ఆలోచన చేస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
" టిక్‌టాక్ యాప్‌పై ఆలోచిస్తున్నాం. త్వరలోనే యాప్‌ను నిషేధించొచ్చు. దాంతోపాటు మరికొన్ని ఇతర పనులు చేయొచ్చు. మాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. టిక్‌టాక్‌కు సంబంధించి చాలా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం."