అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలకు కొవిడ్ వ్యాక్సిన్(Us Covid 19 Vaccination) తప్పనిసరి చేసింది ఆ దేశ ప్రభుత్వం. దేశంలోని వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జనవరి 4లోగా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోవాలని లేదా వారానికోసారి కొవిడ్-19 టెస్టు చేయించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. గురువారం నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
భారీ జరిమానా..
గడువులోపు ఉద్యోగులు, కార్మికులకు టీకా కార్యక్రమం(Us Covid 19 Vaccination) పూర్తికాకపోతే.. ఒక్కో ఉల్లంఘనకు 14 వేల డాలర్లు (సుమారు. రూ.10 లక్షలు) జరిమానా ఉంటుందని వృత్తిపరమైన రక్షణ, హెల్త్ అడ్మినిస్ట్రేషన్(ఓషా) తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Biden News).. ఈ రూల్స్‌ను మొదటగా సెప్టెంబర్‌లో సమీక్షించారు. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా 84 మిలియన్ల మంది ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం చూపనుంది.
నర్సింగ్‌హోమ్స్, ఆస్పత్రులు, ఇతర మెడికల్ విభాగంలో 17 మిలియన్ సిబ్బందికీ ఈ రూల్స్ వర్తిస్తాయని ఓషా తెలిపింది. అయితే.. వారికి టెస్టింగ్ ఆప్షన్ లేదని, వ్యాక్సినేషన్ చేసుకోవాలని నిర్దేశించింది. కొత్త నిబంధనలతోపాటు వాణిజ్య సంస్థలు, కార్మిక యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేయనుంది బైడెన్ సర్కార్(Biden News).
ఇదీ చూడండి:రష్యా, జర్మనీపై కొవిడ్ పంజా- మరణాలు, కేసుల్లో కొత్త రికార్డులు