తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2020, 2:45 PM IST

ETV Bharat / international

అమెరికా రావాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి

కొత్తరకం కరోనా(స్ట్రెయిన్​) వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అమెరికా మరింత అప్రమత్తమైంది. బ్రిటన్​(యూకే) నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు అమెరికా వ్యాధి నివారణ కేంద్రం (సీడీసీ) మార్గదర్శకాలను జారీ చేసింది.

US-makes-must-covid-negative-certificate-for-Those-who-are-coming-from-UK
అమెరికాలోకి రావాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి

కరోనా దెబ్బకు విలవిల్లాడిన అమెరికా కొత్తరకం కరోనా(స్ట్రెయిన్​) వైరస్‌ వ్యాప్తిపై మరింత అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చే బ్రిటన్​(యూకే) ప్రయాణికులు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని ఆదేశించింది. ఈ మేరకు ఈ మేరకు అమెరికా వ్యాధి నివారణ కేంద్రం (సీడీసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ధ్రువపత్రం లేనివారిని విమానంలోకి అనుమతించవద్దని విమానయాన సంస్థలకు సూచించింది. సోమవారం నుంచే ఈ మార్గర్శకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మార్చిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యూకేలో పర్యటించిన వారందరి ప్రవేశంపై నిషేధం విధిస్తూ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల్ని ఈ సందర్భంగా సీడీసీ ప్రస్తావించింది.

అలాంటిదేమీ లేదు: వైట్​హౌస్​

సీడీసీ తాజా నిర్ణయంతో ట్రంప్‌ పాలకవర్గానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బ్రిటన్​ నుంచి వచ్చే వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసే ఆలోచనేమీ లేదని శ్వేతసౌధం మంగళవారం తెలిపింది. దీనికి విరుద్ధంగా సీడీజీ తాజా మార్గదర్శకాలు ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి:చైనాలో మళ్లీ కరోనా కేసులు- లక్షల కొద్దీ టెస్టులు

ABOUT THE AUTHOR

...view details