సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. అఫ్గానిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలిగాయి అమెరికా బలగాలు(Afghan US Troops). ఆగస్టు 31న ఇది పూర్తయింది. దాదాపు లక్ష మందికిపైగా ప్రజల్ని.. అఫ్గాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా మంది ఆ దేశంలోనే ఉన్నారు. బలగాల ఉపసంహరణ (Afghanistan US Troops) హడావుడిలో అమాయకులైన అఫ్గాన్ పౌరులతో పాటు.. అమెరికాకు చెందిన కొన్ని కుటుంబాల తరలింపు సాధ్యం కాలేదు.
మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. అఫ్గానిస్థాన్‌లో ఇన్నేళ్లు సేవలందించిన అమెరికా శునకాలను(Service Dogs Afghanistan) కూడా బలగాలు అక్కడే వదిలేసి వచ్చాయంట. ఆ సర్వీస్ డాగ్స్ ఆకలితో అలమటిస్తున్నాయి.
అమెరికా సైనికులు తొందరపాటులో తిరిగొచ్చారని చెబుతున్నప్పటికీ.. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ జాగిలాల్ని.. వెటరన్ షీప్‌డాగ్స్ ఆఫ్ అమెరికా అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అమెరికాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం కాబుల్‌లో వాటి బాగోగుల్ని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భారత్ మాత్రం.. అఫ్గాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన ఐటీబీపీకి చెందిన మాయ, బాబీ, రూబీ కే-9 జాగిలాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ రెండింటినీ పోలుస్తూ.. అమెరికా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.