తెలంగాణ

telangana

ETV Bharat / international

హెచ్​-1బీ జారీలో జాప్యంపై సభ్యుల ఆగ్రహం

హెచ్-1బీ వీసా ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై అమెరికా చట్టసభ్యులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థుల నుంచి సంబంధంలేని ఆధారాలను అమెరికా ఇమ్మిగ్రేషన్​ సంస్థ కోరుతుండటమే జాప్యానికి కారణమవుతోందని తెలిపారు. ఫలితంగా సిలికాన్​ వ్యాలీ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్​-1బీ

By

Published : Jul 18, 2019, 6:52 PM IST

హెచ్​-1బీ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ఇమ్మిగ్రేషన్​ సంస్థ (యూఎస్​సీఐఎస్​) తీరుపై అమెరికా చట్ట సభ్యులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వీసా దరఖాస్తు దారుల నుంచి సంబంధం లేని మరిన్ని ఆధారాలు (ఆర్​ఎఫ్​ఈ) అడుగుతూ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

అమెరికా కంపెనీలు హెచ్​-1బీ వీసా సాయంతో విదేశాల్లోని వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. ఈ వీసాతోనే భారత ఐటీ నిపుణులు అధికంగా లాభం పొందుతున్నారు. ఈ వీసా ప్రక్రియలో జాప్యం కారణంగా వృత్తి నిపుణులు ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారని చట్టసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"టొరంటో (కెనడా)లో ఐటీ ఆదాయం సిలికాన్​ వ్యాలీ, వాషింగ్టన్​తో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఇందుకు యూఎస్​సీఐఎస్​తో పాటు మన ఇమ్మిగ్రేషన్​ విధానాలే కారణమని చాలా మంది భావిస్తున్నారు."

-సుసాన్​ ఎల్లెన్​ లాఫ్​గ్రెన్​, కాంగ్రెస్ సభ్యురాలు

నాలుగు నెలల్లో 60 శాతం

2019లో ఆర్​ఎఫ్​ఈ అభ్యర్థనలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వచ్చిన 60 శాతం దరఖాస్తులకు ఆధారాలను కోరింది ఇమ్మిగ్రేషన్​ శాఖ. ఈ సంఖ్య 2016 ఏడాది మొత్తం చేసిన ఆర్​ఎఫ్​ఈ అభ్యర్థనలకు 20.8 శాతం అధికం.

ఈ స్థాయిలో అభ్యర్థనలు పెరిగేందుకు కారణమేమిటని యూఎస్​సీఐఎస్​ అసోసియేట్​ డైరెక్టర్​ డొనాల్డ్​ న్యూఫెల్డ్​ను లాఫ్​గ్రెన్​ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిచ్చారు.

"ఏదైనా కొత్త మార్పులు వస్తే ఆ విషయాలపై అధికారులతో పాటు ప్రజలకూ తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా దరఖాస్తులను తిరస్కరించకుండా ఆర్​ఎఫ్​ఈలను అభ్యర్థిస్తున్నాం. "

- డొనాల్డ్​ న్యూఫెల్డ్​, యూఎస్​సీఐఎస్​ అధికారి

నిబంధనల్లో మార్పులు వస్తే ప్రజలకు తెలిసేలా ప్రకటనలు చేయాలని అమెరికా ఇమ్మిగ్రేషన్​ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మార్కెట్టా లిండిట్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్​ ఏజెన్సీనే పూర్తి స్థాయి వివరాలు అందివ్వాలన్నారు. ఇలా ఆకస్మిక నిర్ణయాలతో సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటాయని ఆమె చెప్పారు.

నైపుణ్యాల వృద్ధి కార్యక్రమాలకే ఆ సొమ్ము: వాణిజ్య మంత్రి

హెచ్​-1బీ వీసా రుసుము ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికన్ల నైపుణ్య వృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రి విల్​బర్​ రాస్​ స్పష్టం చేశారు. ఈ మేరకు"పరిశ్రమ గుర్తించిన అప్రెంటిస్​షిప్​ వ్యవస్థ"ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రారంభించారని తెలిపారు.

ఇదీ చూడండి: 10 శాతం తగ్గిన హెచ్​-1బీ వీసాల జారీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details