ఇరాన్ క్షిపణి నియంత్రణ వ్యవస్థలు, నిఘా కేంద్రాలపై అమెరికా సైబర్ దాడులు చేపట్టింది. అగ్రరాజ్య నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసినందుకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చిన వెంటనే ప్రతీకార దాడులకు అధ్యక్షుడు ట్రంప్ సిద్ధపడ్డారు. కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బదులుగా ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.
అదే సమయంలో ఇరాన్‌పై సైబర్ దాడులు నిర్వహించాలని రహస్యంగా యూఎస్ సైబర్ కమాండ్‌ను ట్రంప్ ఆదేశించారని వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. ఈ సైబర్ దాడితో ఇరాన్ రాకెట్, క్షిపణి ప్రయోగాలను నియంత్రించడానికి ఉపయోగించే కంప్యూటర్లు నిర్వీర్యమయ్యాయని తెలిపింది.
ఢీ అంటే ఢీ...