వీసాదారుల వేతనాల పరిధి విషయంలో అమెరికా కార్మిక శాఖ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. వలసదారులు, వలసేతరుల వేతనాలకు సంబంధించి వచ్చే 60 రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఈ మేరకు ఓ ఫెడరల్ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేముందు తీసుకొచ్చిన నూతన విధానాన్ని 18 నెలల పాటు నిలుపుదల చేసిన బైడెన్ సర్కారు.. ఈ సమయంలో ఓ విధానాన్ని రూపొందించాలని భావిస్తోంది. ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన విధానం మార్చి 9న అమల్లోకి రావాల్సి ఉండగా.. బైడెన్ సర్కారు దాన్ని ఆపింది. గతంలో ఉన్న లాటరీ పద్ధతినే ఈ ఏడాది చివరి వరకూ అమల్లోకి తెచ్చింది.