అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. చైనా కరెన్సీ యువాన్ తగ్గుదలపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా మోసపూరితంగా కరెన్సీ విలువను మార్చే దేశమని అధికారిక ముద్ర వేసింది. వాణిజ్య రంగంలో పోటీ ప్రయోజనం పొందేందుకు యువాన్‌ను డ్రాగన్‌దేశం అక్రమంగా వాడుకుంటోందని ఆరోపించింది.
డాలర్‌తో పోలిస్తే సోమవారం యువాన్ విలువ 7.03కు పడిపోయింది. 11ఏళ్లలో ఈ స్థాయికి పతనం కావటం ఇదే తొలిసారి. అమెరికా మరోసారి పన్నులు పెంచనున్నట్లు చేసిన ప్రకటనను తటస్థీకరించడానికి యువాన్ మారకం విలువను చైనా తగ్గించిందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చైనా కంపెనీలు కొనుగోళ్లు చేయటం నిలిపేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీ తెరపైకి వచ్చింది. నిర్ణయం చకచకా అమలైంది.
"ట్రంప్ సూచనల మేరకు చైనాను కరెన్సీ మానిపులేటర్ దేశంగా ప్రకటిస్తున్నాం."