అమెరికాలో 'టిక్‌టాక్'ను నిషేధించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగాన్ని యూఎస్ ఫెడరల్ జడ్జ్ నిలుపుదల చేశారు. టిక్‌టాక్ విషయంలో ప్రభుత్వం తమ అధికారాలను మీరి నిర్ణయాలు తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు.
ట్రంప్ టిక్‌టాక్ బ్యాన్ యత్నాలకు బ్రేక్! - టిక్ టాక్ నిషేధానికి ట్రంప్ ప్రయత్నాలు
పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతా కారణాలతో టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అమెరికా ఫెడరల్ జడ్జ్ స్టే విధించారు.
టిక్‌టాక్ బ్యాన్‌కు అడ్డుకట్ట
టిక్‌టాక్ ద్వారా చైనా ప్రభుత్వం తమ పౌరుల డేటాను చోరీ చేస్తోందనే ఆరోపణలతో.. ఆ యాప్ బ్యాన్ చేస్తామని ట్రంప్ ఆగస్టులో హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా నిషేధం అమలులోకి రాలేదు. ఆ తర్వాత కూడా టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించే ఆఫర్ ఇచ్చిన ట్రంప్ యంత్రాంగం.. నిషేధాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.
ఇదీ చూడండి:అంతరిక్ష కేంద్రానికి క్రిస్మస్ బహుమతులు పంపిన స్పేస్ఎక్స్