గూఢచర్యం ఆరోపణలతో 544 రోజులు బందీకానాలో ఉన్న వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయునికి, అతని కుటుంబానికి ఇరాన్ 180 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది యూఎస్ ఫెడరల్ కోర్టు.
ఇరాన్‌పై దావా..
వాషింగ్టన్ పోస్టు పాత్రికేయుడు జాసన్ రెజియాన్ ఇరాన్ తనపై భౌతిక దాడులకు పాల్పడిందని, హింసకు గురిచేసిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. దీనిపై యూఎస్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ జె లియాన్ తాజాగా తీర్పు వెలువరించారు. ఇరాన్ అధికారులు.. బందీగా ఉన్న రేయాన్‌ను నిద్రపోకుండా చేశారని, శారీరక హింసకు పాల్పడ్డారని, అతని ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ఇరాన్‌ది పూర్తిగా శిక్షార్హమైన నేరమని ఆయన వ్యాఖ్యానించారు.
"ఇరాన్... జాసన్‌ను నిర్బంధించింది. చంపేస్తామని బెదిరించింది. అమెరికాలోని ఇరాన్ ఖైదీలను విడిపించుకునేందుకు.. జాసన్‌ను బేరానికి పెట్టింది."
- రిచర్డ్ జె లియాన్, యూఎస్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి