అల్‌ఖైదాకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది అబు మహమ్మద్ అల్-మస్రీని నిజంగానే హతమయ్యాడు. మోస్ట్ వాటెండ్ లిస్ట్‌లో ఉన్న ఇతడిని.. అమెరికా-ఇజ్రాయెల్ సైనికులు ఓ రహస్య ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం నిఘా అధికారులు తాజాగా ధ్రువీకరించారు. ఆగస్టు 7న ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో అతడిని హతమార్చినట్లు స్పష్టం చేశారు. అయితే ఆపరేషన్ పూర్తి వివరాలు వెల్లడించేందుకు మాత్రం వారు నిరాకరించారు.
అల్ఖైదారెండో కీలక వ్యక్తి అయిన అల్ మస్త్రీ నేతృత్వంలోనే.. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగింది. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్-మస్రీనే అన్న ఆరోపణ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇతడి కోసం తీవ్రంగా గాలిస్తోంది అమెరికా. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ చర్యలను మరింత వేగవంతం చేశారు.