తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనాతో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది'

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య కోటి దాటడం, మృతుల సంఖ్య 2.5 లక్షలకు సమీపించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌచీ. మహమ్మారి కారణంగా దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆవేదన చెందారు.

Doctor Anthoni Fauci
'కరోనాతో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది'

By

Published : Nov 13, 2020, 9:28 PM IST

అమెరికాలో కరోనా వ్యాప్తిపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్​ ఆంథోని ఫౌచీ. అగ్రరాజ్యంలో కోటికిపైగా వైరస్ కేసులు, సుమారు 2.5 లక్షల మరణాలు సంభవించడంపై స్పందించిన ఆయన.. కొవిడ్​ విషయంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. వాషింగ్టన్​ నేషనల్​ కేథడ్రాల్​లో జరిగిన ఓ వర్చువల్​ కార్యక్రమంలో ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే.. కరోనాను అంతమొందించేందుకు త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 90శాతం వరకు పనిచేసే టీకాలు వచ్చాయని, ఇవి 95శాతం వరకూ ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయన అన్నారు.

అలా చేస్తే లాక్​డౌన్​ అక్కర్లేదు!

ఇలాంటి పరిస్థితులు 15 లేదా 20 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే.. ఇప్పుడున్న స్థితికి చేరుకోవడానికి మరికొన్నేళ్లు పట్టేదని చెప్పుకొచ్చారు ఆంథోని. కరోనాను అరికట్టేందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని తప్పనిసరి చేస్తే.. కరోనా కేసులను అదుపులోకి తీసుకురావచ్చని ఆంథోని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశంలో లాక్​డౌన్​ విధించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.​

ఫార్మా దిగ్గజం ఫైజర్​ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్​.. డిసెంబర్​, జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు ఫౌచీ. ఏప్రిల్, మే, జూన్​లోగా సాధరణ వ్యక్తి కూడా వ్యాక్సిన్​ పొందేలా ఉండాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:భారతీయ అమెరికన్‌ కుర్రాడు.. బైడెన్‌ ప్రచారాన్ని హోరెత్తించాడు!

ABOUT THE AUTHOR

...view details