తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో మహిళను పట్టాలపైకి తోసిన భారతీయుడు - మహిళను పట్టాలపైకి తోసిన భారత సంతతి వ్యక్తి!

మహిళను రైల్వే పట్టాలపైకి తోసిన ఘటనలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితురాలు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధరించారు.

US-INDIAN-ARREST
మహిళను పట్టాలపైకి తోసిన భారత సంతతి వ్యక్తి!

By

Published : Nov 22, 2020, 9:01 PM IST

అమెరికాలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన ఆదిత్య వేములపాటి అనే వ్యక్తిని అమెరికా మాన్​హట్టన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. మాన్​హట్టన్​ యూనియన్​ స్క్వేర్​లోని రైల్వే స్టేషన్​లో రైలు కోసం చూస్తున్న లిలియానా లానోస్​ అనే మహిళను పట్టాలపైకి తోశాడు ఆదిత్య. ఈ ఘటనలో ఆమెకు గాయలయ్యాయి. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధరించారు.

అతడిని విచారించిన జడ్జి డిసెంబరు 4వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details