తెలంగాణ

telangana

అమెరికాలో దక్షిణాసియా ప్రజల కోసం 'సాఫా'

By

Published : Apr 20, 2021, 10:31 AM IST

అమెరికాలో రాజకీయ సాధికారత సాధించే లక్ష్యంతో 'సౌత్​ ఏషియన్​ ఫర్​ అమెరికా' (ఎస్​ఏఎఫ్ఏ) అనే సంస్థను స్థాపించనున్నట్లు ప్రవాస భారతీయుల బృందం ప్రకటించింది. మే 6న లాంఛనంగా ఏర్పాటు చేయనున్నామని తెలిపింది.

Indian Americans
ఇండియా, అమెరికా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించేందుకు.. కీలక పాత్ర పోషించిన ప్రవాస భారతీయులు 'సౌత్​ ఏషియన్​ ఫర్​ అమెరికా' (ఎస్​ఏఎఫ్​ఏ) అనే సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో రాజకీయ సాధికారత సాధించే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మే 6న లాంఛనంగా ఏర్పాటు చేయనున్నామని స్పష్టం చేశారు.

సౌత్​ ఏషియా ఫర్​ బైడెన్​(ఎస్​ఏబీ) అనే సంస్థ బైడెన్​ గెలుపులో కొంత పాత్ర పోషించింది. ఇదే ఇప్పుడు ;సాఫా'కు శ్రీకారం చుట్టనుంది. అమెరికాలో దక్షిణాసియా ప్రజల రాజకీయ భాగస్వామ్యం పెంచేలా ఈ సంస్థ కృషి చేయనుంది. దక్షిణాసియా ప్రజల ఓటింగ్​ సామర్థ్యం, ఐక్యతపై ప్రధానంగా దృష్టి సారించనుంది. మే 6న జరగనున్న కార్యక్రమంలో ఇండియన్​ అమెరికన్​ కాంగ్రెస్​ సభ్యుడు రాజా కృష్ణ మూర్తి, వర్జీనియా స్టేట్​ సెనేటర్​ ఘజాలా హశ్మీ తదితరులు పాల్గొననున్నారు.

"ఎస్​ఏఎఫ్​ఏ స్థాపించడం ఆనందాన్ని కలిగించింది. 2020 ఎన్నికల్లో ఎస్​ఏబీ ఆవశ్యకత.. భవిష్యత్తులో దక్షిణాసియా ప్రజల రాజకీయ సాధికారత ప్రాముఖ్యాన్ని గుర్తుచేసింది. కేవలం ఎన్నికల వరకే ఈ ఐక్యత పరిమితం కాకూడదు."

-నేహా డివాన్​, ఎస్​ఏబీ నేషనల్​ డైరెక్టర్​

ఇదీ చదవండి:సీరం సంస్థ వినతిపై అమెరికా మౌనం

ఇదీ చదవండి:అత్యవసరమైతేనే భారత్​కు వెళ్లండి: అమెరికా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details