తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ అమెరికా మైత్రి బలోపేతం - పౌర అణు విద్యుత్​ కేంద్రాలు

భారత విదేశాంగ కార్యదర్శి విజయ్​గోఖలే అమెరికా పర్యటన విజయవంతమైంది. ఇరుదేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి.

భారత్​ అమెరికా మైత్రి బలోపేతం

By

Published : Mar 16, 2019, 11:28 AM IST

భారత్​-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్​- అమెరికా దేశాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్​ గోఖలే మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించారు.

పర్యటన విజయవంతమైందని గోఖలే వెల్లడించారు. భారత్​-పాకిస్థాన్​ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గోఖలే అమెరికా పర్యటన విజవంతమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇరుదేశాలు ఇండో-పసిఫిక్​ సమస్యలపై దృష్టిని కేంద్రీకరించాయి. వ్యూహాత్మక రక్షణ, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలనిభారత్​-అమెరికానిర్ణయించాయి. అలాగే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక 'పౌర అణు ఇంధన సహకార' ఒప్పందం కుదిరింది. ఫలితంగా భారత్​లో అమెరికా ఆరు పౌర అణు విద్యుత్​ కేంద్రాలను నెలకొల్పడానికి అంగీకరించింది.

మూడు రోజుల పర్యటనలో విజయ్​గోఖలే, అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్​ బోల్టన్​తో విడివిడిగా సమావేశమయ్యారు.

భారత్​కు బాసటగా...

జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్​​ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్​పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతకు అమెరికా తన మద్దతు ప్రకటించింది. భారత్ స్వీయ రక్షణ హక్కును అగ్రరాజ్యం సమర్థించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్​కు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చింది.

కలిసికట్టుగా ముందుకెళ్దాం..

మారణాయుధాల నిర్మూలన, వాటి సరఫరాను అడ్డుకోవాలనిభారత్​-అమెరికాలు సంయుక్తంగా తీర్మానించాయి.


ABOUT THE AUTHOR

...view details