ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 200కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇందులో 60శాతం డోసులు 3 దేశాలకే వెళ్లాయన్న డబ్ల్యూహెచ్ఓ.. అమెరికా, భారత్, చైనా దేశాలు ఎక్కువ శాతం టీకాలను పొందినట్లు పేర్కొంది.
అటు ప్రపంచవ్యాప్తంగా 212 దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా అందులో 10 దేశాలే 75శాతం టీకాలను పొందినట్లు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ సీనియర్, సలహాదారుడు బ్రూస్ ఐల్వర్డ్ అన్నారు. 127 దేశాలకు టీకాలను సరఫరా చేయటంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఇవి దోహదపడ్డాయని బ్రూస్ ఐల్వర్డ్ అన్నారు.