తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​న​కు కాంగ్రెస్ షాక్ ​- నెగ్గిన డెమొక్రాట్ల తీర్మానం

ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై ఇరాన్​ క్షిపణుల దాడి అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్​ను కట్టడి చేయాలని డెమొక్రాట్లు నిర్ణయించారు. ఈ మేరకు ఇరాన్​తో యుద్ధం వద్దంటూ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రతినిధుల సభలో 224-194 తేడాతో నెగ్గింది.

US House votes to curb Trump war power on Iran
ట్రంప్​న​కు కాంగ్రెస్ షాక్​-నెగ్గిన డెమొక్రాట్ల తీర్మానం

By

Published : Jan 10, 2020, 1:15 PM IST

పశ్చిమాసియాలో మరో యుద్ధానికి అమెరికా కారణం కాకూడదని, ఇరాన్​తో తలపడకూదని ప్రవేశపెట్టిన తీర్మానానికి అగ్రరాజ్య ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అమెరికా-ఇరాన్​ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ట్రంప్​ పార్టీ చెందిన కొందరు​ ప్రతినిధులు కూడా మద్దతు తెలిపారు. ప్రతినిధుల సభలో 224-194తో తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం తర్వాత సెనెట్​కు వెళ్లనుంది. అక్కడ ట్రంప్​కు 53-47మద్దతు ఉంది.

తప్పుబట్టిన డెమొక్రాట్లు

ఇరాన్​ జనరల్​ సులేమానీ హత్యకు ట్రంప్ పూనుకోవడాన్ని డెమొక్రాట్లు తీవ్రంగా ఆక్షేపించారు. ​అమెరికాకు వ్యతిరేకంగా సులేమానీ పనిచేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపకుండా, కాంగ్రెస్​ అమోదం పొందకుండా సులేమానీని మట్టుబెట్టడాన్ని తప్పుబట్టారు స్పీకర్​ నాన్సీ పెలోసి.
కాంగ్రెస్​ అమోదం లేకుండా అధ్యక్షుడు ఇతర దేశాలపై దాడి చేయకూడదని 1973లో తీర్మానం చేశారు. ట్రంప్​ తన విచక్షాధికారాలను వినియోగించి ఇరాన్​తో కయ్యానికి దిగినట్లు మండిపడ్డారు పెలోసి.

రిపబ్లికన్ల అభిప్రాయాలు..

ట్రంప్​ ప్రధాన అనుచరుడు మాట్ గేట్జ్ లాంటి కొందరూ ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వటం గమనార్హం. ఈ చర్య ట్రంప్​ను విమర్శించేందుకు కాదనీ, పశ్చిమాసియాలో మరో యుద్ధం వద్దని మాత్రమే తన ఉద్దేశమని పేర్కొన్నారు గేట్జ్​.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details