అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నలుగురు డెమొక్రాట్ మహిళా ప్రతినిధులను ఉద్దేశించి చేసిన ట్వీట్లపై పెను దుమారం రేగింది. ట్రంప్ జాత్యహంకార వైఖరికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ అమెరిగా దిగువ సభలో డెమొక్రాట్లు తీర్మానం ప్రవేశపెట్టారు. 240-184 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి చెందిన నలుగురు ప్రతినిధులూ మద్దతు తెలపడం విశేషం.
అమెరికాను ద్వేషించే వారు, ఇష్టపడని వారు దేశం వీడి వెళ్లాలని నలుగురు మహిళా డెమొక్రాట్ ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఆదివారం ట్వీట్ చేశారు ట్రంప్.
ఈ వ్యాఖ్యలను డెమొక్రాట్లు తీవ్రంగా తప్పుబట్టారు. జాతి వివక్షకు నిదర్శమని విమర్శించారు. అమెరికాలో వలసదారులకూ స్వేచ్ఛ, భద్రత ఉంటాయని తీర్మానం ప్రవేశపెట్టిన డెమొక్రాట్ ప్రతినిధి స్పష్టం చేశారు.