అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వచ్చే సోమవారం సెనేట్‌కు చేరుకోనుంది. ప్రతినిధుల సభలో గత వారం గట్టెక్కిన అభిశంసనను స్పీకర్ నాన్సీ పెలోసీ సెనేట్‌కు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెనేట్‌లో పూర్తిస్థాయిలో విచారణ ఉంటుందని మెజారిటీ నేత చక్ షుమర్ స్పష్టం చేశారు.
ఈ నెల 6న జరిగిన క్యాపిటల్ హింసాకాండలో తన మద్దతుదారులను ట్రంప్ ప్రేరేపించారన్న ఆరోపణలతో డెమొక్రాట్లు మాజీ అధ్యక్షుడిపై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించారు.
ఇదే జరిగితే.. సెనేట్‌లో రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు. అదే సమయంలో పదవీ విరమణ అనంతరం విచారణను ఎదుర్కొన్న మొదటి అధ్యక్షుడిగానూ ట్రంప్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని.. ఈ నెల 7న ఆ దేశ కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించేందుకు సమావేశమైన క్రమంలో.. క్యాపిటల్ భవనంపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన ఈ హింసకాండలో ఓ మహిళ మృతిచెందారు.
ఇదీ చదవండి:రణరంగంలా మారిన అమెరికా క్యాపిటల్ భవనం