తెలంగాణ

telangana

ETV Bharat / international

మహాత్ముడికి అమెరికా చట్టసభ్యుల నివాళి

మహాత్మా గాంధీ జయంత్రి సందర్భంగా అమెరికా చట్ట సభ్యులు బాపూజీకి నివాళులర్పించారు. ట్విట్టర్​ వేదికగా గాంధీ అహింసా సూత్రాలను గుర్తుచేసుకున్నారు.

us house pays tribute to mahatma gandhi on his 151 birth anniversary
మహాత్ముడికి అమెరికా చట్టసభ్యుల నివాళి

By

Published : Oct 2, 2020, 10:11 AM IST

మహాత్ముడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా అమెరికా చట్టసభ్యులు ట్విట్టర్ వేదికగా బాపూజీని స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను, సత్యం, అహింసా సూత్రాలను మరోసారి నెమరువేసుకున్నారు.

"న్యాయం కోసం అహింసా మార్గంలోనే అత్యుత్తమ పోరాటం చేయగలమని మహాత్మా గాంధీ మాకు నేర్పించారు."

- రోహిత్​ ఖన్నా, కాంగ్రెస్​ సభ్యుడు

"మహాత్మా గాంధీ.. మానవ చరిత్ర గతిని మార్చారు. తన పనులతో ఎంతోమందికి ఆయన ఆదర్శనీయులు అయ్యారు."

- టామ్​ సుజీ, కాంగ్రెస్​ సభ్యుడు

"మనలోని విభేదాలను పక్కన పెట్టి, అందరికీ సమానమైన ప్రపంచాన్ని మనం సృష్టించిన నాడే గాంధీకి నిజమైన గౌరవం ఇచ్చినట్లు."

- టీజే కోక్సా, కాంగ్రెస్ సభ్యుడు

"ఇతరుల సేవకు జీవితాన్ని అర్పించినప్పుడే మన గురించి మనం తెలుసుకోగలమని గాంధీజీ నమ్మారు. ప్రజాప్రతినిధులుగా ఆయన చేసిన సేవలను, అందుకున్న ఘనతలను ఆచరణలో పెట్టడం మా బాధ్యత."

- ఫిట్జ్​పేట్రిక్, కాంగ్రెస్ సభ్యుడు

"ఆయన మాటలు డా. మార్టిన్​ లూథర్​ కింగ్​తో సహా ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి. ఎన్నో శాంతియుత ఉద్యమాలకు బాటలు పరిచాయి."

- టెడ్​ యోహో, కాంగ్రెస్ సభ్యుడు

వీరితో పాటు మరికొంతమంది చట్ట సభ్యులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మహాత్ముడికి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details