అంతర్జాతీయ స్థాయిలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా అమెరికా కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ ఓ కీలక చట్టానికి గురువారం ఆమోదం తెలిపింది. క్వాడ్ కూటమిలో భాగంగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లతో పాటు ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అందులో సూచించింది. 'ఎన్సూరింగ్ అమెరికన్ గ్లోబల్ లీడర్‌షిప్ అండ్ ఎంగేజ్‌మెంట్ (ఈగల్) చట్టం'గా దీన్ని పిలుస్తున్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దౌత్యాన్ని, నాయకత్వాన్ని బలపర్చుకోవడం గురించి అందులో ప్రధానంగా ప్రస్తావించారు.
చైనా దూకుడుకు కళ్లెం వేసే 'ఈగల్'
చైనా దూకుడును కట్టడి చేసేలా అగ్రరాజ్యం కీలక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ముసాయిదాకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో క్వాడ్‌లో సభ్య దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం కానున్నాయి.
అమెరికా ఈగల్ చట్టం
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడం కోసం క్వాడ్ ఇంట్రా పార్లమెంటరీ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. పశ్చిమాసియాలో అణ్వస్త్ర సాంకేతికత, బాలిస్టిక్ క్షిపణులను చైనా వేగంగా వ్యాప్తి చెందిస్తున్న తీరును అడ్డుకోవాల్సిన ఆవశ్యకతనూ నొక్కిచెప్పారు.
ఇదీ చూడండి:తాలిబన్లకు సాయం చేస్తూ పాక్ కొత్త కుట్రలు!
Last Updated : Jul 17, 2021, 6:39 AM IST