తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ అభిశంసన తీర్మానానికి దిగువసభ ఆమోదం - donald trump latest news

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని... ప్రతినిధుల సభ గురువారం 232-196 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. ఆధునిక కాలంలో ఓ అమెరికా అధ్యక్షుడిపై ఇలా అభిశంసన తీర్మానం నెగ్గడం ఇది మూడోసారి.

ట్రంప్ అభిశంసన తీర్మానంపై దిగువసభ ఆమోదం

By

Published : Nov 1, 2019, 8:44 AM IST

Updated : Nov 1, 2019, 10:34 AM IST

ట్రంప్ అభిశంసన తీర్మానానికి దిగువసభ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభ గురువారం ఆమోదించింది. యూఎస్​ కాంగ్రెస్ దిగువ సభలోని 435 మంది సభ్యులు 232-196 ఓట్ల తేడాతో ఈ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించారు.

ముచ్చటగా మూడోసారి..

ఆధునిక కాలంలో ఓ అమెరికా అధ్యక్షుడిపై ఇలా అభిశంసన తీర్మానం నెగ్గడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు ఆండ్రూ జాన్సన్​, బిల్​ క్లింటన్​ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే సెనేట్​లో మాత్రం వారి అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఇప్పటి వరకు అభిశంసన ప్రక్రియ ద్వారా ఏ అమెరికా అధ్యక్షుడినీ తొలగించలేదు.

అంత సులభం కాదు..

అమెరికా ప్రతినిధుల సభలో 233 మంది సభ్యులతో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉంది. అధికార రిపబ్లికన్లకు 197 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
సెనేట్​లో రిపబ్లికన్ పార్టీ 53 సీట్లతో మెజారిటీ కలిగి ఉంది. డెమొక్రాట్లకు 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనుక సెనేట్​లో అభిశంసన తీర్మానం నెగ్గే అవకాశం లేదు.

అధికార దుర్వినియోగం!

ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు.. దిగువసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ చర్యను శ్వేతసౌధం తీవ్రంగా తప్పుపట్టింది.

ఇదీ చూడండి: మొదటిసారిగా 108 ఎమ్​పీ​ కెమెరాతో.. షియోమీ నోట్​ 10!

Last Updated : Nov 1, 2019, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details