అగ్రరాజ్యంలో కరోనా (Covid USA)మరణాల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మూడు నెలల్లోనే లక్ష మందికిపైగా వైరస్‌కు (Covid deaths in US) బలయ్యారు. డెల్టా వ్యాప్తితో (Delta in USA) కరోనా ఉద్ధృతి తీవ్రం కాగా.. సగటున రోజుకు 2 వేల మంది వైరస్‌కు ప్రాణాలు కోల్పోయారు.
కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతకొద్ది వారాలుగా నమోదవుతున్న రోజువారీ సగటు కేసుల సంఖ్య పడిపోతోంది. దీంతో ఆస్పత్రుల్లో రోగుల రద్దీ తగ్గిపోయింది. అయితే, కరోనా ఇప్పుడే పూర్తిగా అంతమైనట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో మరో వేవ్ అమెరికాపై ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
దేశమంతటా నాలుగో వేవ్ అత్యున్నత దశకు చేరుకుందని వైద్య నిపుణులు వెల్లడించారు. అయితే, ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయని తెలిపారు. సుమారు ఏడు కోట్ల మంది అమెరికన్లు ఇంకా టీకా తీసుకోలేదని చెప్పారు. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమని అన్నారు.