అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ లాంటి పెద్ద దేశాల కంటే అమెరికానే చాలా మెరుగ్గా ఉందన్నారు. అందువల్లనే మిగతా దేశాల కంటే యూఎస్‌లో కరోనా మరణాలు రేటు చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ఇప్పటి వరకు 34,79,483 మందికి కరోనా సోకగా.. 1,38,247 మంది మరణించారు. అంటే మిగతా ప్రపంచదేశాలతో పోల్చుకుంటే అమెరికాలోనే ఎక్కువ కొవిడ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. అయితే అమెరికాలో నిర్వహించిన స్థాయిలో మిగతా దేశాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే... ఆశ్చర్యకరమైన రీతితో పాజిటివ్ కేసులు బయటపడతాయని ట్రంప్ చెబుతున్నారు.
ఎక్కువ పరీక్షలు నిర్వహించాం..
యూఎస్‌లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్న విమర్శలపై... ట్రంప్ భిన్నంగా స్పందించారు.
"ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో భారీ ఎత్తున కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందువల్లనే మిగతా దేశాల కంటే అధికంగా యూఎస్‌లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది."