తెలంగాణ

telangana

ETV Bharat / international

4 చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం - జిన్​జియాంగ్​కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

చైనాలోని జిన్​జియాంగ్ రాష్ట్రానికి చెందిన 4 కంపెనీలు, ఓ తయారీ కేంద్రంపై అమెరికా ఆంక్షలు విధించింది. మైనారిటీ వర్గాల వారిని నిర్బంధ కార్మికులుగా పని చేయించుకుంటున్నారనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా కంపెనీల నుంచి వచ్చే దిగుమతులపైనా నిషేధం విధించింది.

forced labour issue in China
జిన్​జియాంగ్​కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

By

Published : Sep 15, 2020, 9:00 AM IST

మైనారిటీ వర్గాలకు చెందిన వారిని నిర్బంధ కార్మికులుగా ఉపయోగిస్తున్నాయన్న అనుమానంతో చైనాకు చెందిన 4 సంస్థలు, ఓ తయారీ కేంద్ర దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్‌ రాష్ట్రం నుంచి అమెరికాకు వస్త్రాలు, ఖాదీఉత్పత్తులు, కంప్యూటర్‌ విడిభాగాలు, వెంట్రుకల ఉత్పత్తులు దిగుమతి కాకుండా అగ్రరాజ్యం నిషేధించింది.

మైనారిటీలను బంధించి..

జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మైనారిటీల అణచివేతలో భాగంగా వారిని నిర్బంధ శ్రామికులుగా వినియోగిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికాకు చేస్తున్న ఎగుమతులు నిషేధించిన తయారీ కేంద్రంలో వీగర్‌ వర్గ ప్రజలు సహా వివిధ మైనారిటీలను బంధించి బలవంతంగా పని చేయిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. నిర్బంధ కార్మిక వ్యవస్థ దారుణమని, అమెరికా విలువలకు విరుద్ధమని అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం తెలిపింది.

జిన్‌జియాంగ్‌ నుంచి ఎగుమతి అవుతున్న టెక్స్‌టైల్స్‌, టమాటా, ఖాదీ ఉత్పత్తులు అన్నింటిని నిషేధించాలని అమెరికా భావిస్తోంది. వీగర్‌, కాజాక్‌, కిర్గిజ్‌ ముస్లిం వర్గాలు సహా ఇతర మైనారిటీ వర్గాల నుంచి దాదాపు 10 లక్షల మందిని చైనా అధికారులు బంధించి శ్రామికులుగా మార్చారని నివేదికలు వెలువడ్డాయి. అయితే వీరి సమస్యలపై చైనా నోరు మెదపడం లేదు.

ఇదీ చూడండి:కాంట్రాక్టుకు చంద్రుడు- బిడ్లు ఆహ్వానించిన నాసా

ABOUT THE AUTHOR

...view details