అమెరికాలో లాక్డౌన్ ఆంక్షలు సడలించడం వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే ముస్సోరీ రాష్ట్రంలో వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ.. ఓ హెయిర్ స్టైలిష్ట్ షాపు తెరిచి వ్యాపారం ప్రారంభించాడు. ఎనిమిది రోజుల్లో ఏకంగా 84 మంది కస్టమర్లకు ఇతను సేవలందించాడు. ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారందరినీ కాంటాక్ట్ ట్రేసింగ్ చేసే పనిలో పడ్డారు.
ఫేస్బుక్ ద్వారా..!
తనతో పాటు మరో వ్యక్తి కూడా పని చేశాడని.. అతనికి స్వల్ప లక్షణాలున్నట్లు హెయిర్ స్టైలిస్ట్ ఫేస్బుక్ ద్వారా తెలిపాడు. మే 16 నుంచి 20 వరకు ఐదు షిఫ్టుల్లో 56 మంది కస్టమర్లకు ఇతను సేవలందించినట్లు తెలిపాడు. సెలూన్ షాపును మూసేసి శానిటైజేషన్ చేయించినట్లు స్పష్టం చేశాడు.
ముస్సోరీ రాష్ట్రంలో కొత్తగా 218 మంది మహమ్మారి బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 11వేల మందికి పైగా వైరస్ సోకిందని వివరించింది. మరో 10 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 671కి చేరిందని వెల్లడించింది.
ఇదీ చూడండి: వీడిన మిస్టరీ: మహారాష్ట్రలో మర్డర్- తెలంగాణలో అరెస్ట్