తెలంగాణ

telangana

ETV Bharat / international

కుమార్తె పుట్టినరోజునే విషాదం- దొంగల కాల్పుల్లో తండ్రి మృతి - గుజరాతీ హత్య

US Gujarati Shot Dead: అమెరికాలో నివసిస్తున్న ఓ ఎన్​ఆర్​ఐని కాల్చి చంపారు దుండగులు. మృతుడిని కొలంబస్​లో నివసిస్తున్న అమిత్​ పటేల్​గా అధికారులు గుర్తించారు. గుజరాత్​కు చెందిన పటేల్​ గత 12 ఏళ్లుగా కొలంబస్​లో ఉంటున్నారు.

US Gujarati Shot Dead
అమిత్​ పటేల్

By

Published : Dec 8, 2021, 4:23 PM IST

US Gujarati Shot Dead: కుమార్తెకు మూడేళ్లు నిండాయని ఆనందించేలోపే ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్యాంకు పని మీద అని బయటకు వెళ్లిన తండ్రి.. దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. ఈ దుర్ఘటన అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగింది. మృతుడిని గుజరాత్​లోని ఖేడా జిల్లా నదియాడ్​కు చెందిన అమిత్​ పటేల్​గా గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

కుటుంబంతో అమిత్​ పటేల్​
అమిత్​ పటేల్​

కుమార్తె పుట్టిన రోజునే..

అమిత్​ పటేల్ (45)​.. గత 12 ఏళ్లుగా కొలంబస్​లోనే నివాసం ఉంటున్నారు. ఆయన ఓ పెట్రోల్​ బంక్​ నడుపుతున్నారు. మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) పటేల్​ కుమార్తె పుట్టినరోజు. ఇదే సమయంలో బ్యాంకులో డబ్బును డిపాజిట్​ చేయడానికి పటేల్​ వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని దుండుగులు వాటిని దోచుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పటేల్​ను కాల్చి చంపారు.

ఇదీ చూడండి :కరోనాపై 158 రోజుల పోరాటం- ఎట్టకేలకు మహిళ విజయం

ABOUT THE AUTHOR

...view details