తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫేస్​బుక్​కు షాక్- అమెరికా అవిశ్వాస వ్యాజ్యం

అమెరికా ప్రభుత్వం సహా 48 రాష్ట్రాలు సోషల్​ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​కు షాకిచ్చాయి. చిన్న సంస్థలను అణిచివేసేందుకు ఫేస్​బుక్ మార్కెట్​ అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో అవిశ్వాస వ్యాజ్యం దాఖలు చేశాయి.

US govt, states bring antitrust action against Facebook
ఫేస్​బుక్​పై అవిశ్వాస వ్యాజ్యం దాఖలు

By

Published : Dec 10, 2020, 5:51 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌పై అమెరికా ప్రభుత్వం సహా 48 రాష్ట్రాలు, జిల్లాలు అవిశ్వాస వ్యాజ్యం దాఖలు చేశాయి. చిన్న సంస్థలను అణిచివేసేందుకు సామాజిక మాధ్యమాల్లో మార్కెట్‌ అధికారాన్ని దుర్వినియోగం చేసిందంటూ ఫేస్‌బుక్‌పై ఆరోపణలు గుప్పించాయి. ఈ మేరకు ఫేస్‌బుక్‌పై అవిశ్వాస వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌, న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ప్రకటించారు.

ఫేస్‌బుక్‌ అనుబంధ సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌పై ఆ సంస్థ హక్కులు వదులుకోవాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. సంస్థలను ఆక్రమించుకోవడాన్ని ఆపి మార్కెట్‌లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ సూచించారు.

ఇదీ చూడండి:43 శాతం పెరిగిన ఫేస్​బుక్​ ఇండియా ఆదాయం

ABOUT THE AUTHOR

...view details