తెలంగాణ

telangana

ETV Bharat / international

'మిత్రదేశం' నుంచి త్వరలోనే 50 వెంటిలేటర్లు

అమెరికా పంపనున్న వెంటిలేటర్లు త్వరలోనే భారత్​కు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 200 వెంటిలేటర్లు పంపనున్నట్లు తెలిపారు. ఇందులో వాణిజ్య కోణమేమీ లేదని సాయం కిందే వీటిని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ventilator
వెంటిలేటర్లు

By

Published : May 19, 2020, 5:43 PM IST

భారత్​కు వెంటిలేటర్ల సాయం అందిస్తానని హామీ ఇచ్చిన అమెరికా.. అందుకు కార్యచరణ సిద్ధం చేసింది. మొత్తం 200 వెంటిలేటర్లు పంపనున్న అగ్రరాజ్యం.. తొలివిడతలో 50 వెంటిలేటర్లను అందించనుంది. త్వరలోనే ఈ వెంటిలేటర్లు భారత్​కు చేరుకుంటాయని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఏఐడీ) యాక్టింగ్ డైరెక్టర్ రమోనా ఎల్​ హమ్​జౌయి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మిత్ర దేశం భారత్​కు వెంటిలేటర్లు పంపిస్తా: ట్రంప్​

"భారత్​కు 200 వెంటిలేటర్లను అందించడానికి అమెరికా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. త్వరలోనే తొలివిడతలో 50 వెంటిలేటర్లు భారత్​కు చేరుకుంటాయి. వెంటిలేటర్లు పంపే అంశంపై భారత వైద్య శాఖ, ఇండియన్ రెడ్​ క్రాస్ సొసైటీలతో సంప్రదింపులు జరుపుతున్నాం."

-రమోనా ఎల్​ హమ్​జౌయి, యూఎస్ఏఐడీ యాక్టింగ్ డైరెక్టర్

వ్యాపారం కాదు

భారత్​ సరఫరా చేసిన హైడ్రాక్సీక్లోరోక్విన్​కు బదులుగా వీటిని అందిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వెంటిలేటర్లను వ్యాపార దృష్టికోణంతో పంపడం లేదని రమోనా స్పష్టం చేశారు. వాటిని సాయం కిందే అందిస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైన వారికి వెంటనే చికిత్స అందించడానికి ఈ వెంటిలేటర్లు భారత్​కు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.

కరోనా సాయం

వైరస్​పై పోరాడటానికి ప్రపంచదేశాలకు అమెరికా అండగా ఉంటున్నట్లు తెలిపారు రమోనా. వివిధ దేశాల కోసం మొత్తం 900 మిలియన్ డాలర్ల నిధి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇందులో భారత్​కు 5.9 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

సంయుక్త శిక్షణ

భారత్​లోని 14 రాష్ట్రాలకు చెందిన 30 వేల హెల్త్ సెంటర్​లలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సేవల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు రమోనా. భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇప్పటివరకు మొత్తం 20 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details