తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇక వైద్యులకు హెచ్​1 బీ వీసాలు- ట్రంప్​ నిర్ణయం అందుకే.!

కరోనా నుంచి అమెరికాను కాపాడేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్​1 బీ వీసా ఆంక్షలను సడలించారు. అమెరికాలోని ఆసుపత్రుల్లో పనిచేసేందుకు, టెలీమెడిసిన్​ వంటి వైద్య కోర్సులను అభ్యసించేందుకు వైద్యులకు వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు.

H-1B work visa
హెచ్​1బీ వీసాలు వారికి మాత్రమే

By

Published : May 15, 2020, 3:42 PM IST

కరోనా వైరస్‌ ప్రభావం అమెరికాలోనే ఎక్కువ ఉంది. కరోనా కోరల నుంచి అగ్రరాజ్యాన్ని రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యంలో వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు హెచ్​1బీ వీసా మార్గదర్శకాల్లో కొన్ని సడలింపులు చేసింది. వర్క్​ వీసా పేరిట వైద్య సిబ్బందికి టెలీమెడిసిన్​ ప్రాక్టీసుకు అవకాశాలు కల్పించనుంది. అక్కడి స్థానిక ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు.. ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది ట్రంప్​ ప్రభుత్వం​.

వేలసంఖ్యలో హెచ్​1 బీ..!

హెచ్​1 బీ అనేది నాన్​ ఇమిగ్రెంట్​ వీసా. అమెరికాలోని సంస్థల్లో ఉద్యోగం చేయాలంటే ఇది తప్పనిసరి. పలు రంగాల్లో అనుభవమున్న నిపుణులకు పరిమిత సంఖ్యలో మాత్రమే ఇవి ఇస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయంతో... 'ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్'‌ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న వీసాలు భర్తీ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ పడింది.

ఈ వీసాతో అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించి ఆర్థికంగా ఆర్జించడమే కాకుండా, అమెరికాలో నివాసాన్ని పొందవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

గడుపు పెంచాలని విజ్ఞప్తి..

వీసా అనుమతిలో భాగంగా ఉద్యోగంలో చేరే ముందు ఎక్కడ, ఎంత కాలం పనిచేయనున్నారు? వంటి విషయాలు చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే అమెరికా సిటిజన్​షిప్​ అండ్​ ఇమిగ్రేషన్​ సర్వీసెస్​(యూఎస్​సీఐఎస్​) అనుమతి తప్పనిసరి. ఇప్పటివరకు పంటి వైద్యులకు వీసా కాలం పూర్తయ్యాక అమెరికాలో ఉండేదుకు 60 రోజులు మాత్రమే గరిష్ఠ గడువు ఉండేది. వాటిని 180 రోజులకు పెంచాలని సూచించింది అమెరికన్​ డెంటిస్ట్​ అసోసియేషన్​(ఏడీఏ). ఫలితంగా ఇలాంటి సంక్షోభంలోనూ వైద్యులు దేశాన్ని విడిచివెళ్లకుండా అక్కడే మరింతకాలం సేవలందించవచ్చని అభిప్రాయపడింది.

ఇటీవలె హెచ్​ 1 బీ వీసాల కేటాయింపులను నిలిపివేశారు ట్రంప్​. ఈ నిర్ణయం వల్ల ఇమిగ్రేషన్​ వ్యవస్థ దెబ్బతింటుందని.. ఇది అమెరికా అభివృద్ధికే విఘాతమని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details