తెలంగాణ

telangana

ETV Bharat / international

టిక్​టాక్​కు చిక్కులు- అగ్రరాజ్యంలో కీలక విచారణ - టిక్​టాక్ అమెరికా దృష్టి

అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో వినియోగదారులను సంపాదించుకున్న టిక్​టాక్​పై అమెరికా దృష్టి పెట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా యాప్​పై విచారణ చేపట్టినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. యాప్​లో వ్యక్తిగత సమాచారం నిక్షిప్తం ఎలా చేస్తుందో అన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం.

భద్రతా కారణాలతో 'టిక్​టాక్'​పై అమెరికా విచారణ!

By

Published : Nov 2, 2019, 3:58 PM IST

Updated : Nov 2, 2019, 8:22 PM IST

అతి తక్కువ కాలంలో ఎనలేని క్రేజ్‌ సంపాదించుకున్న చైనా యాప్​ 'టిక్‌టాక్‌'పై అమెరికా విచారణ ప్రారంభించింది. జాతీయ భద్రతా ప్రమాణాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ యాప్‌ ద్వారా రాజకీయ సంబంధ సున్నిత సమాచారం ఏదైనా పక్కదారి పడుతుందేమోనన్న కారణంగా ఈ విచారణ చేపట్టినట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. వ్యక్తిగత సమాచారానికి సంబంధించి అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

అమెరికాలో 2.65 కోట్లు

టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. అమెరికాలో 26.5 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఇందులో 60 శాతం మంది టీనేజర్లు. టిక్​టాక్​ను ఉపయోగించేవారు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల కమిటీ విచారణ జరపాలని నిర్ణయించింది.

ఈ వార్తలపై స్పందించిన సంస్థ.. దీనిపై ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయలేమని చెప్పింది. వినియోగదారుల నమ్మకాన్ని పొందడమే తమ ప్రథమ ఉద్దేశమని వెల్లడించింది. విచారణకు సహకరిస్తామని తెలిపింది.

ఇదీ చూడండి:గ్రీన్ ఇండియా​ ఛాలెంజ్​ను​ స్వీకరించిన పీవీ సింధు

Last Updated : Nov 2, 2019, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details