తెలంగాణ

telangana

ETV Bharat / international

బెదిరింపే కారణమా... లేక నిర్లక్ష్యమా?

అమెరికాలోని అట్లాంటాలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై కారు దూసుకొచ్చిన కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించడం వల్లే నిందితుడు తప్పించుకునేందుకు కారు వేగంగా నడిపాడని అతని తరపు న్యాయవాది చెబుతున్నారు.

కారు ప్రమాదంలో పాపకు గాయాలు

By

Published : Apr 4, 2019, 12:36 PM IST

Updated : Apr 4, 2019, 1:32 PM IST

కారు ప్రమాదంలో పాపకు గాయాలు

ఇంటి ముందు ఓ పాప ఆడుకుంటోంది. ఒక్కసారిగా ఓ కారు ఆ పాపపైకి దూసుకొచ్చింది. ఏమైందో తెలుసుకునే లోపే అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

అమెరికాలోని అట్లాంటాకు 20 మైళ్ల దూరంలో గల లిథోనియాలో ఈ ఘటన జరిగింది. 9 ఏళ్ల లాదిర్హన్నా ఇంటి ముందు ఆడుకుంటోంది. తనవైపు దూసుకొస్తున్న కారును చూసి తప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ కారు వేగంగా పాపపైకి దూసుకొచ్చింది. కారును గాబ్రియల్​ జెబ్రీ ఫోర్డమ్​ (28) నడుపుతున్నాడు. ప్రమాదం జరిగాక కొద్ది సేపు అక్కడే ఉన్న ఫోర్డమ్​, చుట్టు పక్కలవారు అక్కడకు చేరుకోవడం వల్ల తాను జారుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన పాపను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప చికిత్స పొందుతోంది.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై రోడ్డు నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యపు డ్రైవింగ్​ కేసులు నమోదు చేశారు.

"నిందితుడు ఫోర్డ్​ ఫ్యూజన్​ కారులో, ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు బాలికలు లాదోర్హన్నా, అలిషా ఫిలిప్స్​పైకి దూసుకొచ్చాడు. ఈ సమయంలో కారులో అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించాం. దర్యాప్తులో నిందితుడు గాబ్రియల్​ జెబ్రీ ఫోర్డమ్ (28)గా గుర్తించాం." - జెఏ లూయీస్​, డెకాల్బ్​ కౌంటీ పోలీసు అధికారి

నిందితుని న్యాయవాది వాదన మాత్రం మరోలా ఉంది. తన క్లైంట్​ని తెల్ల ప్యాంట్​ ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించాడని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇందుకు సాక్ష్యం ప్రమాదం జరిగిన తరువాత కారు పక్క నుంచి తెల్ల ప్యాంట్​ ధరించిన వ్యక్తి పరారైన దృశ్యాలే అని అతను వాదిస్తున్నారు.

Last Updated : Apr 4, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details