మీరెప్పుడైనా దొంగ, పోలీసు ఛేజింగ్ చూశారా? దొంగ పారిపోతుంటే... పోలీసులు జీపుతోనో, బైక్‌తోనే తరుముకుంటూ వెళ్లి పట్టుకుంటారు. కానీ ఓ అమెరికన్ పోలీసు మాత్రం సైకిల్‌పై ఛేజ్ చేసి ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్నారు. ఆశ్చర్యంగా ఉందా? మీరే చూడండి.
సైకిల్‌తో ఛేజ్ చేసి నిందితుడిని పట్టుకున్న పోలీస్ అమెరికాలోని అట్లాంటాలో హత్యారోపణలు ఎదుర్కొంటున్న నికోలస్ ఫోన్సెకా అనే నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంటబడ్డారు. కానీ వాడి వేగాన్ని అందుకోలేకపోయారు.
దీనితో ఓ పోలీసు దారిన పోతున్న ఓ సైక్లిస్ట్‌ను ఆపి, అతని సైకిల్ని బదులు తీసుకున్నారు. ఆ సైకిల్‌తోనే నిందితుడిని చేజ్ చేస్తూ.. అతను పారిపోతున్న మార్గాన్ని మిగతా పోలీసులకు తెలియజేశారు. దీనితో పోలీసులు చాకచక్యంగా పారిపోతున్న నిందితుడిని వలవేసి పట్టుకున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
21 ఏళ్ల నికోలస్ ఫోన్సెకా హత్య కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం అతనిని ఫుల్టన్ కౌంటీ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి:ఈ విషయాల్లో మౌనమే ట్రంప్ కొంప ముంచుతోంది!