పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బుధవారం అధికారికంగా వైదొలిగింది. ఒప్పందం నుంచి తప్పుకోనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మూడేళ్లకు ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న తరుణంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
2017లో ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 2019లో ఐక్యరాజ్య సమితికి నోటిఫికేషన్ అందించింది అమెరికా. తాజాగా.. బుధవారం ఒప్పందం నుంచి అగ్రరాజ్యం వైదొలిగింది.