అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంటలు, పశువులను కోల్పోయి... రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాష్ట్రంలో ఎటు చూసినా నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి. హెలికాప్టర్లతో సహాయ చర్యలు చేపడుతున్నారు అధికారులు.
అమెరికా నెబ్రాస్కాలో వరదలు- భారీగా ఆస్తినష్టం - Nebraska
అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. వంద కోట్ల డాలర్లకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు గవర్నర్ ప్రకటించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అమెరికా వరదలు
140 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం
ఊహించని విపత్తుకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 1.4 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగిందని గవర్నర్ పీట్ రిక్కెట్స్ ప్రకటించారు. ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెబ్రాస్కాలోని 74 ప్రాంతాలు, 85 నగరాల్లో అత్యయిక స్థితి ప్రకటించారు.