తెలంగాణ

telangana

ETV Bharat / international

Kabul airport blast: కాబుల్​ మృతులకు సంతాపంగా జెండా అవనతం! - కాబుల్ మృతులకు అమెరికా సంతాపం

కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన వరుస పేలుళ్లలో (Kabul airport blast) 13 మంది అమెరికా సైనకులు సహా 60 మంది అఫ్గాన్​ పౌరులు మృతి చెందారు. మృతులకు సంతాపంగా ఆగస్టు 30 వరకు అమెరికా జాతీయ పతాకం అవనతం (US flag to fly at half) చేయాలని ఆదేశించింది అమెరికా.

US flag to fly at half
అమెరికా జాతీయ పతాకం అవనతం

By

Published : Aug 27, 2021, 9:19 AM IST

Updated : Aug 27, 2021, 9:52 AM IST

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం జరిగిన వరుస పేలుళ్లలో మృతి చెందిన సైనికులు, సాధారణ పౌరులకు సంతాపంగా జాతీయ జెండా అవనతానికి(US flag to fly at half) ఆదేశించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. శ్వేతసౌధంతో పాటు ప్రభుత్వ భవనాలు, మిలిటరీ, నావల్​ పోస్టుల్లో ఆగస్టు 30 వరకు జాతీయ పతాకం అవనతం చేయనున్నట్లు చెప్పారు. వాటితో పాటు విదేశాల్లోని అమెరికా రాయబార, కాన్సులర్​ సహా ఇతర కార్యాలయాల్లోనూ జెండా అవనతానికి ఆదేశించారు.

కాబుల్​ విమానాశ్రయం వెలుపల జరిగిన వరుస (Kabul airport blast) పేలుళ్ల ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు మరణించగా.. 18 మంది గాయపడ్డారు. గాయాలపాలైన తమ రక్షణ సిబ్బందిని సర్జికల్​ సదుపాయాలున్న సీ-17 విమానం ద్వారా తరలించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.

అఫ్గాన్​లో 2300 అమెరికా సైనికులు మృతి

అఫ్గానిస్థాన్​లో జరిగిన వివిధ దాడుల్లో 2001 నుంచి ఇప్పటి వరకు తమ సైనికులు 2,300 మంది (US troops died in Afghanistan) మృతి చెందినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ వెల్లడించారు. 20,000 మంది గాయాలపాలైనట్లు వెల్లడించారు. సుదీర్ఘంగా జరిగిన వివిధ యుద్ధాల్లో ఇప్పటి వరకు 800,000 మంది అమెరికా సైనికులు మరణించినట్లు వివరించారు. వారందరితో పాటు, ఇతర కారణాలతో మరణించిన, గాయపడిన సైనికులందరిని తాము గౌరవిస్తామని బ్లింకెన్ వివరించారు.

ఇదీ చదవండి:కాబుల్​ పేలుళ్లను ఖండించిన తాలిబన్లు

Last Updated : Aug 27, 2021, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details