కరోనా వ్యాక్సిన్ తయారీలో కీలక ముందడుగు పడింది. తొలి విడతలో భాగంగా కొంతమంది వలంటీర్లపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 'సానుకూల మధ్యంతర' ఫలితాలు వచ్చినట్లు అమెరికన్ డ్రగ్ తయారీ సంస్థ మోడెర్నా వెల్లడించింది.
గుడ్ న్యూస్: కరోనా వ్యాక్సిన్ తయారీ ఫేజ్-1 సక్సెస్! - US firm Moderna
కరోనా వ్యాక్సిన్ తొలి విడత క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు అమెరికాకు చెందిన ఓ డ్రగ్ తయారీ సంస్థ తెలిపింది. ఎనిమిది మంది వలంటీర్లలో రోగనిరోధక ప్రతిస్పందనలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు స్పష్టం చేసింది.
కరోనా వ్యాక్సిన్ మొడెర్నా
క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన ఎనిమిది మంది శరీరాల్లో రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగేలా వ్యాక్సిన్ ప్రభావం చూపించిందని మోడెర్నా తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తుల్లో కనిపించే స్థాయిలో ఈ ఇమ్యూన్ ఉత్పత్తి జరిగినట్లు స్పష్టం చేసింది.
జూలైలో నిర్వహించే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పెద్ద సంఖ్యలో వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగం చేయనున్నట్లు స్పష్టం చేసింది మోడెర్నా.