తెలంగాణ

telangana

ETV Bharat / international

కుటుంబంలోని ఐదుగురిని హతమార్చిన బాలుడు

అమెరికా తుపాకీ సంప్రదాయం మరో ఐదుగురిని బలితీసుకుంది. అలబామాలోని ఎల్క్​మాంట్​లో ఓ 14 ఏళ్ల బాలుడు కుటుంబంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు నిందితుడు.

By

Published : Sep 4, 2019, 9:03 AM IST

Updated : Sep 29, 2019, 9:26 AM IST

తుపాకి ఎఫెక్ట్​: కుటుంబంలోని ఐదుగురిని హతమార్చిన బాలుడు

అమెరికా తుపాకీ సంస్కృతితో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలబామా రాష్ట్రంలోని ఎల్క్‌మాంట్‌ అనే ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడు తన కుటుంబంలోని ఐదుగురు సభ్యులను తుపాకీతో కాల్చి చంపాడు. కుటుంబీకులను హతమార్చిన అనంతరం పోలీసులకు ఫోన్​చేసిన నిందితుడు ఘటన వివరాలు తెలిపి లొంగిపోయాడు.

ఈ దుశ్చర్యలో ఇద్దరు మైనర్లు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తమకు 14 ఏళ్ల బాలుడు ఫోన్‌ చేసి తన కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులను కాల్చి చంపినట్లు చెప్పాడని... అనంతరం తాము ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు పోలీసులు.

కాల్పుల తర్వాత బాలుడు తుపాకీని దూరంగా విసిరేశాడు. పోలీసులు మారణాయుధం కోసం గాలిస్తున్నారు. బాలుడు హత్యలు చేసేందుకు గల కారణాలు వెల్లడించలేదని రక్షకభటులు వెల్లడించారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం

Last Updated : Sep 29, 2019, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details