చైనా నూతనంగా తీసుకొచ్చిన కోస్ట్ గార్డు చట్టంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల దక్షిణ చైనా సముద్రంలో సరిహద్దు వివాదాలు పెరుగుతాయని మండిపడింది. విదేశీ వాహన నౌకలు.. దక్షిణ చైనా సముద్రంలోకి రాకుండా బలగాలను మోహరించి కట్టడి చేయాలని.. ఈ చట్టంలో ఉందని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
" అమెరికాతో పాటు ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేసియా, జపాన్ దేశాలు సైతం చైనా వైఖరిపై మండిపడుతున్నాయి. ఈ చట్టం వల్ల ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని చైనా.. ఆ దేశ ప్రాంతీయ భాషలో రూపొందించింది. ఆ భాషలోని భావం ప్రకారం.. చైనా కోస్టు గార్డు చుట్టూ భారీగా బలగాలను మోహరించి.. గస్తీ నిర్వహించాలని ఉంది. ఈ చట్టంలో.. ఇతర దేశాల ఆర్థిక విధానాలకు అడ్డుకట్ట వేయాలని సైతం ఉంది."
-- నెడ్ ప్రైస్, అమెరికా విదేశాంగ ప్రతినిధి